![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -282 లో..... నీ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడని శ్రీధర్ ని వాళ్ళ ఫ్రెండ్ అడుగగానే.. శ్రీధర్ దగ్గుతాడు. అప్పుడే కార్తీక్ ని వాటర్ తీసుకొని రమ్మని చెప్తాడు. వాటర్ ఇస్తున్న కార్తీక్ ని చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. అక్కడే ఉన్న పారిజాతం, జ్యోత్స్నలు ఆశ్చర్యంగా చూస్తారు. మీరు ఇప్పుడు మా మావయ్యని మీ కొడుకు ఎక్కడ అని అడిగారు కదా ఇదిగో అతనే మా బావ అని జ్యోత్స్న చెప్తుంది.
శ్రీధర్ అవమానంగా ఫీల్ అవుతాడు. మరి ఇలా ఇలా చేస్తున్నాడు ఎంటని అతను అనగానే.. అదిగో ఆ వంటమనిషి ని చేసుకొని ఇలా తయారయ్యాడంటూ జ్యోత్స్న చెప్తుంది. ఇదంతా మీ భార్యకి తెలుసా అని అతను అడగానే.. ఏ భార్యకి అంటూ పారిజాతం ఇంకా శ్రీధర్ పరువు తీసే లాగా మాట్లాడుతుంది. అప్పుడే శ్రీధర్ ఫ్రెండ్ వాళ్ళ భార్య వచ్చి.. వంటలు చాలా బాగున్నాయంట అందరు చెప్తున్నారని అంటుంది. దాంతో కార్తీక్, దీప లు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. జ్యోత్స్న, పారిజాతం ల మొహం వాడిపోతుంది. మంచి జోడి అని అతను కార్తీక్ , దీప లని మెచ్చుకొని పేమెంట్ కాల్ చేసిన నెంబర్ కి పంపిస్తానని అతను చెప్పగానే కార్తీక్, దీపలు వెళ్లిపోతారు. చిరాకుగా శ్రీధర్ పారిజాతం, జ్యోత్స్న వెళ్ళిపోతారు అవమానించాలన్న ప్రతిసారీ ఇలా జరుగుతుందని పారిజాతంతో జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు దాస్ దగ్గర డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. స్పృహలోకి వచ్చినప్పుడల్లా ఇలా పేపర్స్ పై రాస్తున్నాడంటూ స్వప్న, కాశీ లు చెప్తారు. త్వరలోనే మీ నాన్న రికవరీ అవుతాడని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్నలు మాట్లాడుకుంటారు. ఎవరైనా నువ్వు వీళ్ళ కూతురు కాదని చెప్తే పరిస్థితి ఎంటని పారిజాతం అనగానే.. అలా ట్రై చేసినందుకే కదా నీ కొడుకుకి ఆ పరిస్థితి వచ్చిందని సడెన్ గా అంటుంది. అంటే దాస్ ని కొట్టింది నువ్వా అని పారిజాతం అనగానే.. లేదంటు కవర్ చేస్తుంది. కార్తీక్ ఇంటికి వచ్చి అక్కడ జరిగింది మొత్తం చెప్పి శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతంపై కోపంగా ఉంటాడు.
ఆ తర్వాత దశరథ్ కి డాక్టర్ ఫోన్ చేసి.. దాస్ సిచువేషన్ ఇప్పుడు పర్వాలేదు కానీ పేపర్ పై ఏదో రాస్తున్నాడని ఆ రాసినవి డాక్టర్ దశరథ్ కి పంపిస్తాడు. అవి ధశరథ్ చూస్తాడు. అందులో వారసురాలు.. నిజం చెప్పాలి అంటూ రాసి ఉంటుంది. కచ్చితంగా ఏంటో కనుక్కోవాలని దశరథ్ అనుకుంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న కి మేనేజర్ ఫోన్ చేసి రెస్టారెంట్ లాస్ లో ఉంది.. మీరేమో ఆడిట్ లో లాభం చూపించామంటున్నారని అంటాడు. నేను చూసుకుంటానని జ్యోత్స్న ఫోన్ లో మాట్లాడడం దశరథ్ వింటాడు. ఎన్ని అబద్ధాలు ఆడుతావ్ జ్యోత్స్న అంటూ దశరథ్ అడుగగా.. జ్యోత్స్న కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |